వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్ టీమ్

  • వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన
  • జరిగిన నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్లు
  • 397 కోట్ల నష్టం వాటిల్లిందన్న గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్​ బాషా
  • 199 కాలనీలు నీట మునిగినట్లు వెల్లడి

హనుమకొండ, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటించింది. సిటీలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. వరద నష్టాన్ని అంచనా వేసి, కేంద్రానికి నివేదిక అందించేందుకు ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం మంగళవారం వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకోగా.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా స్వాగతం పలికారు. 

వరంగల్‌‌లో సెంట్రల్ టీమ్ హనుమకొండ కలెక్టరేట్‌‌లో రెండు జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద నష్టాన్ని వివరించారు. తర్వాత జవహర్ కాలనీ, నయీంనగర్, భద్రకాళి బండ్, బొందివాగు, ఎన్ఎన్ నగర్, ఇల్లంద ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది. వదరల వల్ల వరంగల్ నగరంలో పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, పైపులైన్లు దెబ్బతిని రూ.397.88 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి గ్రేటర్ వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. సిటీలో 199 కాలనీలు నీట మునిగాయని చెప్పారు. 

భారీగా దెబ్బతిన్న రోడ్లు
వరంగల్‌‌లో జులై 18 నుంచి 27 వరకు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీంతో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని సెంట్రల్ టీమ్‌‌కు గ్రేటర్ కమిషనర్ బాషా వివరించారు. 150.61 కిలోమీటర్ల సీసీ రోడ్డు దెబ్బతినడంవల్ల రూ.110.71 కోట్లు, 82.73 కిలోమీటర్ల బీటీ రోడ్డు దెబ్బతిని రూ.92.94 కోట్లు, 84 కిలోమీటర్ల మెటల్​రోడ్లు దెబ్బతినగా రూ.43.55 కోట్లు, 75.23 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు దెబ్బతినగా రూ.9.37 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. 

128 కిలోమీటర్ల మేర డ్రైనేజీ దెబ్బతిని రూ.63.9 కోట్లు, 71 కల్వర్టులు దెబ్బతిని రూ.52.41 కోట్లు, 41.3 కిలోమీటర్ల మంచినీటి సరఫరా పైప్ లైన్ ధ్వంసమై రూ.25 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, వరద బాధితుల నుంచి 535 ఫిర్యాదు వచ్చాయని, 5 రెస్పాన్స్ టీంలు సేవలందించాయని చెప్పారు. నగరంలో 199 కాలనీలు పాక్షికంగా నీట మునగగా డీవాటరింగ్ చేశామని, 3,500 మంది ముంపు బాధితులను 27 పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.