బాసరలో త్వరలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం

భైంసా, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల క్రితం బాసరకు మంజూరు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆదిలాబాద్ ​ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్​తో కలిసి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ను కలిసి పలు విషయాలపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం 2020లో బాసరలో విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిందని, అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదన్నారు. వర్సిటీకి అనువైన స్థలం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు వినతి పత్రం అందించామన్నారు. వర్సిటీ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా విద్యార్థులతో పాటు చుట్టు పక్కల జిల్లాల వారికి మెరుగైన విద్య అందుతుందని పేర్కొన్నారు.