శీష్‌‌‌‌ మహల్‌‌‌పై విచారణకు కేంద్రం ఆదేశం

శీష్‌‌‌‌ మహల్‌‌‌పై విచారణకు కేంద్రం ఆదేశం
  • రెనోవేషన్‌‌‌‌లో అక్రమాల ఆరోపణలతో చర్యలు

 న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా పనిచేసిన టైంలో అర్వింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసం 'శీష్ మహల్' రెనోవేషన్‌‌‌‌లో  భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.శీష్‌‌‌‌ మహల్‌‌‌‌ పునరుద్ధరణకు అయిన ఖర్చులపై సమగ్ర విచారణ జరపాలని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ (సీపీడబ్ల్యూడీ)ని సెంట్రల్‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (సీవీసీ) కోరింది. 

సీపీడబ్ల్యూడీ తన నివేదికను సమర్పించడంతో  ఈ నెల 13న సీవీసీ విచారణకు ఆదేశించింది. ఫ్లాగ్‌‌‌‌ స్టాఫ్ రోడ్‌‌‌‌లో 40 వేల చదరపు గజాల(8 ఏకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ నేత విజేందర్ గుప్తా గతేడాది అక్టోబర్ 14న సీవీసీకి ఫిర్యాదు చేశారు. రాజ్‌‌‌‌పూర్ రోడ్డులోని ప్లాట్ నంబర్ 45, 47తో సహా ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని రెండు బంగ్లాలను, ఇతర ప్రభుత్వ ఆస్తులను కూల్చివేసి 'శీష్ మహల్' లో కలిపారని ఆరోపించారు.