హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా రెండు గోదాములను నిర్మించాలని సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తన గోదాములను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ మోడల్‌లో 45 సంవత్సరాలపాటు లీజుకు ఇస్తుంది.
తెలంగాణలో నాంపల్లి, వరంగల్‌లో గోదాములు ఏర్పాటు చేస్తారు. ఇందుకు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియాను నాలెడ్జ్ పార్ట్నర్గా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకుంది. ల్యాండ్ పార్సిళ్లను భారతదేశం అంతటా మార్కెటింగ్ చేయడానికి నైట్‌ఫ్రాంక్ సేవలు అందిస్తుంది.