ర్యాలంపాడు బండ్‌‌ను పరిశీలించిన పూణే టీమ్‌‌

ర్యాలంపాడు బండ్‌‌ను పరిశీలించిన పూణే టీమ్‌‌

గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను సెంట్రల్‌‌ వాటర్‌‌ అండ్‌‌ పవర్‌‌ రీసెర్చ్‌‌ స్టేషన్‌‌ పూణే టీం గురువారం సందర్శించింది. ర్యాలంపాడు, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లు సీపేజ్‌‌ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు చెప్పడంతో ప్రాజెక్ట్‌‌లను పరిశీలించినట్లు టీమ్‌‌ మెంబర్స్‌‌ సంజయ్‌‌ బూరెల్, సునీల్‌‌ పిల్లే, నరసయ్య, డాక్టర్ మందిర, డాక్టర్ తనుశ్రీ చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాలంపాడు బండ్‌‌ అప్‌‌ స్ట్రీమ్‌‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌‌ లేవన్నారు. 

డౌన్‌‌ స్ట్రీమ్‌‌ను జియోలాజికల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ చేయాలని చెప్పారు. అదే విధంగా సాయిల్‌‌ కండీషన్‌‌, సాయిల్‌‌ ఇన్వెస్టిగేషన్, డ్యాం కెనాల్స్, రాక్‌‌ మెకానిక్స్‌‌, ఎమర్జెన్సీ యాక్షన్‌‌ ప్లాన్‌‌పై ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే సీఈకి రిపోర్ట్‌‌ ఇస్తామన్నారు. రిమోట్‌‌ సెన్సార్‌‌ టెక్నాలజీ, రిమోట్‌‌ శాటిలైట్‌‌ టెక్నాలజీ ద్వారా డ్యామ్‌‌, బండ్‌‌ కండిషన్‌‌, స్టెబిలిటీపై అంచనాకు వచ్చి రిపోర్ట్‌‌ తయారు చేస్తామన్నారు. అప్‌‌ స్ట్రీమ్‌‌లో ఎలాంటి సమస్యలు లేవని, డౌన్‌‌ స్ట్రీమ్‌‌లో కొంత సమస్య ఉందని దీని పరిష్కారంపై కూడా రిపోర్ట్‌‌ ఇస్తామన్నారు.