సన్ ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనెలపై పన్ను మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ. దీంతో 2024 మార్చి 31 వరకు మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల నూనెల దిగుమతికి పన్ను భారం ఉండదు. దేశంలో వంటనూనెల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేందుకు ఉపయోగపడుతందంది. దిగుమతులు కోటా కోసం మే 27 నుంచి జూన్ 18 లోపు సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ కోటాకు మించి దిగుమతి చేసుకునే నూనెలకు సుంకాలు మాములుగా ఉంటాయన్నారు.ప్రస్తుతం వంటనూనెలపై కస్టమ్స్, సెస్ 5.5 శాతం వసూలు చేస్తున్నారు. ఈ పన్ను లేకుంటే సోయాబీన్ ఆయిల్ లీటరుకు 3 రూపాయలు తగ్గుతుందని తెలిపారు ఎక్స్ పర్ట్స్. మరోవైపు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల రవాణా ఛార్జీల రూపేణ కొంత ఉపశమనం లభిస్తోంది.ఈఏడాది చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉంచి, ధరలు పెరగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకంది. జూన్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించడం గత ఆరేళ్లలో ఇది తొలిసారి.
Centre allows duty free import of 20 Lakh MT crude soyabean, sunflower oil
— ANI Digital (@ani_digital) May 25, 2022
Read @ANI Story | https://t.co/3pMJnuY5FJ pic.twitter.com/s9eCz4AQ0Q