
ఇస్రో 2023లో చంద్రయాన్ –3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్‌ను పంపించగా, చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి చంద్రయాన్–5లో 250 కిలోల రోవర్‌ను పంపించనున్నది. ఈ ప్రాజెక్టును ఇస్రో జపాన్‌తో కలిసి చేపట్టనున్నది. 2008లో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్–1, చంద్రుడి ఉపరితల రసాయన, ఖనిజ, ఫొటో–జియోలాజిక్ మ్యాప్ లను తయారు చేసింది.
2019లో చంద్రయాన్–2 మిషన్‌లో భాగంగా చంద్రయాన్–2 ఆర్బిటర్ లోని హై రిజల్యూషన్ కెమెరా చంద్రుడికి సంబంధించిన వందల చిత్రాలను పంపింది. 2023, ఆగస్టు 23న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది.