
ఆంధ్రప్రదేశ్లోని నాగాయలంకలో క్షిపణి ప్రయోగం కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కేంద్రం నుంచి యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులతోపాటు ఇతర పరీక్షలు చేపట్టవచ్చు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పరీక్షించడం, ముఖ్యంగా రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.