హైదరాబాద్​లో రేడియేషన్ ప్లాంట్ ఏర్పాటుకు 13 కోట్లు

హైదరాబాద్​లో రేడియేషన్ ప్లాంట్ ఏర్పాటుకు 13 కోట్లు
  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​లో రేడియేషన్ ప్లాం ట్ ఏర్పాటు చేయడం కోసం రూ. 13. 64 కోట్ల ఆర్థిక సహకారాన్ని సూత్ర ప్రాయంగా ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ట్రేడ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌‌‌‌పోర్ట్ స్కీమ్(టీఐఈఎస్) కింద ఈ నిధులు ఆప్రూవ్ చేసినట్లు తెలిపింది. మంగళవారం లోక్ సభలో రేడియేషన్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం నిధులు సమకూర్చుతుందా అన్న అంశాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  లేవనెత్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలపాలని ప్రశ్నించారు. 

అయితే, తెలంగాణ ప్రధానంగా బియ్యం ఎగుమతిదారుగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మామిడి, దానిమ్మ, సీతాఫలం వంటి పండ్లకు కీలక సరఫరాదారుగా తెలంగాణ ఉందన్నారు. కాగా, బంగనపల్లి మామిడిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాలానుగుణంగా పండే పండ్ల ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి.. కేంద్ర వాణిజ్య శాఖ విభాగంలోని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడెక్ట్స్ ఎక్స్ పర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) కృషి చేస్తోందని వివరించారు. దీని కింద రిజిస్టర్డ్ ఎక్స్ పోర్టర్స్​కు ఫైనాన్స్ అసిస్టెన్స్ స్కీం(ఎఫ్ఏఎస్) కింద ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని సమాధానంలో వెల్లడించారు.