
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రసాద్ పథకం కింద అభివృద్ధి పనులను చేపట్టడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.4.21 కోట్లతో ఆధునిక వసతులతో మూడు అంతస్తుల అన్నదాన భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఒకేసారి 200 మంది భక్తులు కూర్చొని ప్రసాదాన్ని స్వీకరించొచ్చని చెప్పారు. అన్నదాన భవన నమూనా చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు.