AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎవరూ వాడొద్దు అని.. అలాంటి టూల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఆఫీసుల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించకూడదని ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. AI టూల్స్ ఉపయోగించటం వల్ల విలువైన డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని.. రహస్యంగా ఉండాల్సిన డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది కేంద్రం.
ప్రభుత్వ సమాచారం లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డేటాను సీక్రెట్ గా ఉంచేందుకు అఫీషియల్ ఛాట్ జీపీటీ.. AI మొదలగువాటిని ఉపయోగించడంపై నిషేధం విధించింది. AI టూల్స్ వల్ల ఫైనాన్షియల్ మేటర్స్ కు సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయని కొన్ని ఆధారాలను సేకరించారు.
Also Read :- వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
ప్రభుత్వ వ్యవహారాలు... కొన్ని కీలక డాక్యుమెంట్స్ విషయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు డీప్ సీక్ వాడకాన్ని బేన్ చేశాయి. ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మాన్.. ఇండియా పర్యటనలో భాగంగా ఆయన ఐటీ మంత్రిని కలుస్తారు. ఈ సందర్భంలో AI వాడకం నిషేధానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆఫీసుల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి ఏఐ టూల్స్ వాడకూడదని ఇండియాకు చెందిన ఆర్థికమంత్రిత్వ శాఖలోని ఉద్యోగులకు ఇంటర్నెల్గా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
చాలా సంస్థల్లో కాపీరైట్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. OpenAI భారతదేశంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కాపీరైట్ కేసుల విషయంలో సర్వర్లు లేవని..కోర్టులు కూడా కాపీరైట్ కేసులను.. విచారించకూడదని విచారించకూడదని పేర్కొన్నాయి