ప్రైవేట్‌‌ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ రేట్లు ఫిక్స్


న్యూఢిల్లీ, వెలుగు: ప్రైవేట్ హాస్పిటళ్లలో వ్యాక్సిన్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ప్రైవేట్ సెంటర్లలో ప్రజల నుంచి కొవిషీల్డ్‌‌కు రూ.780, కొవాగ్జిన్‌‌కు రూ.1410, స్పుత్నిక్‌‌కు రూ.1145 కంటే ఎక్కవ తీసుకోకూడదని మంగళవారం ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు కొవిషీల్డ్ ఒక్కో డోసు రూ.600, కొవాగ్జిన్ రూ.1200, సుత్నిక్ వి రూ.948 చొప్పున ఇస్తుండగా.. దానిపై దానిపై ఐదు శాతం జీఎస్టీతో పాటు రూ.150 సర్వీస్‌‌ చార్జ్ కలిపి ఈ రేట్లను కేంద్రం నిర్ణయించింది. ఈ ధరల కంటే ఎక్కువ చార్జ్ చేయకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ వికాస్ శీల్ రాష్ట్రాలు, యూటీలకు లేఖలు రాశారు.