ఐఆర్‌‌‌‌సీటీసీ, ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీకి నవరత్న స్టేటస్‌‌

ఐఆర్‌‌‌‌సీటీసీ, ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీకి నవరత్న స్టేటస్‌‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌‌‌‌సీటీసీ,  ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీలకు నవరత్న స్టేటస్ ఇచ్చింది. నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మారిన  ప్రభుత్వ కంపెనీలకు ఫైనాన్షియల్ ఫ్రీడం ఉంటుంది. గవర్నమెంట్ ఎక్కువగా జోక్యం చేసుకోదు. అలానే విదేశీ మార్కెట్‌‌లో పోటీ పడడానికి ప్రభుత్వం దన్నుగా ఉంటుంది. 

రైల్వే మినిస్ట్రీకి చెందిన  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌‌‌‌సీటీసీ) కు 2023–24 లో రూ.4,250.18 కోట్ల రెవెన్యూ, రూ.1,111.26 కోట్ల నికర లాభం వచ్చాయి. మరోవైపు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ) కి 2023–24 లో రూ.26,644 కోట్ల రెవెన్యూ, రూ.6,412 కోట్ల  నికర లాభం వచ్చాయి. నవరత్న స్టేటస్ అందుకున్న సందర్భంగా ఈ రెండు కంపెనీలను రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌‌  అభినందించారు.