
న్యూఢిల్లీ, వెలుగు: పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషణ్) పథకంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను పెంచుతున్నట్టు కేంద్రం గురువారం ప్రకటించింది. దీంతో 10.36 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో 11.20 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందని తెలిపింది. బాలవాటికలో ఒక్కో విద్యార్థిపై 0.59 పైసలు, ప్రైమరీలో 0.59 పైసలు, అప్పర్ ప్రైమరీలో 0.88 పైసలు పెంచామని వెల్లడించింది. ఈ ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది.
పెరిగిన ధరలకు అనుగుణంగా ఇకపై ప్రతి విద్యార్థికి బాల వాటిక, ప్రాథమిక పాఠశాలల్లో పప్పులు 20 గ్రాములు, కూరగాయలు 50 గ్రాములు, నూనె 5 గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పప్పులు 30 గ్రాములు, కూరగాయలు 50 గ్రాములు, నూనె 5 గ్రాములు అందించనున్నట్టు తెలిపింది.