జికా వైరస్ డేంజర్ బెల్స్ : కేంద్రం అలర్ట్

జికా వైరస్ డేంజర్ బెల్స్ : కేంద్రం అలర్ట్

మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్‌ పాజిటివ్‌ తేలిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. పూణే సిటీలోని అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇంకా కొందరు లక్షణాలతో ఉన్నారు.. కేసుల సంఖ్య పెరగవచ్చని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్‌ కేసుల పెరుగుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది.

జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ దేశాలతోసహా భారత్‌, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌‌, థాయ్‌లాండ్‌, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్‌ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.