తిరుమల లడ్డూ వివాదంపై సిట్ టీం ప్రకటన.. ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు..

ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం రేపిన దుమారం ఇంకా సద్దమనగలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు కేసుల దాఖలయ్యాయి .ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేసిన కేంద్రం ఇవాళ ( సెప్టెంబర్ 24, 2024 ) సిట్ టీంను ప్రకటించనుంది.

సిట్ టీం కోసం వినీత్‌ బ్రిజ్‌లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్‌, పీహెచ్‌డీ రామకృష్ణల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. కల్తీ నెయ్యి సరఫరాపై వివరణ ఇవ్వాలని ఏఆర్ డెయిరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నివేదిక వచ్చాక
తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది కేంద్రం.