న్యూఢిల్లీ: రైతులు సులువుగా అప్పులు ఇవ్వడానికి కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం రూ.వెయ్యి కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా లోన్లు పొందవచ్చు. వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడీఆర్‌ఏ) రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదులకు (ఇ-ఎన్‌డబ్ల్యుఆర్‌లు) బ్యాంకులు లోన్లు ఇచ్చేలా చేయడం ఈ పథకం లక్ష్యం.
దీనికోసం రూ.వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్‌ను అందించామని మంత్రి అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో పంట అనంతర లోన్లు రూ. 5.5 లక్షల కోట్లకు పెరుగుతాయని ఆశిస్తున్నామని చెప్పారు.