
ముంబై: నగదు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని మరింత పెంచాలని కేంద్రం భావిస్తోంది. డిపాజిట్లపై ప్రస్తుతం రూ.ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు మోసాలు విపరీతంగా పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. న్యూ ఇండియా కో–ఆపరేటివ్ బ్యాంకు స్కామ్ బయటపడ్డ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపు గురించి చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.