
ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.. ఏపీ రాజధాని అమరావతికి పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది కేంద్రం. అమరావతి పనుల ప్రారంభం కోసం తోలి విడతగా 25శాతం నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది సీఆర్డీఏ. సీఆర్డీఏ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం రూ. 4వేల 285 కోట్లను విడుదల చేసింది.
ఈ నిధుల్లో వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణాల తొలి విడతతో పాటు కేంద్రం హామీ ఇచ్చిన సాయంలో 20శాతంగా రూ. 750కోట్ల నిధులను మంజూరు చేసింది కేంద్రం.
Also Read:-తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఇష్యూలో కీలక పరిణామం
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతికి సాయం చేస్తామని హామీ ఇచ్చింది కేంద్రం.కేంద్ర బడ్జెట్ లో రూ. 15వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించింది కేంద్రం. ఈ రుణాలకు కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది.