
- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద తెలంగాణలోని 32 జిల్లాల్లో 199 జన్ ఔషధి కేంద్రాలు (జేఏకే) ప్రారంభించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో 5 జన్ ఔషధి కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 15,057 జేఏకేలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి రోజు 10 లక్షల నుంచి12 లక్షల మంది ఈ కేంద్రాల్లో తక్కువ ధరలకే బ్రాండెడ్ మందులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గడిచిన పదేండ్లలో సుమారు రూ.6,975 కోట్ల మందులను రిటైల్ ధరలకు అందించామని వెల్లడించారు. దీంతో దాదాపు రూ.30 వేల కోట్లను మందులపై దేశ ప్రజలకు మిగిలిందని పేర్కొన్నారు.