ఏపీకి గుడ్ న్యూస్ : అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకు వెయ్యి కోట్లు

ఏపీకి గుడ్ న్యూస్ : అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకు వెయ్యి కోట్లు

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పలు జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవలే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనకాపల్లి - ఆనందపురం NH 16 కారిడార్ ను NH-516Cలో షీలానగర్ జంక్షన్‌ను కలుపుతూ 6-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి రూ. 963.93 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపింది కేంద్రం.12.66 కి.మీ విస్తరించి ఉన్న ఈ లేన్ సబ్బవరం గ్రామానికి తూర్పున మొదలై షీలానగర్ జంక్షన్‌లోని ప్రస్తుత పోర్టు రోడ్డులో గెయిల్ ఆఫీస్ దగ్గర ముగుస్తుంది.

ఈ కారిడార్ వల్ల షీలానగర్-ఆనందపురం మధ్య ట్రాఫిక్ సమస్యలు తొలగి విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరగనుంది. దీనివల్ల విశాఖపట్నం పోర్టు లాజిస్టికల్ ఎఫీషియన్సీ పెరుగుతుంది. అంతే కాకుండా ఈ కారిడార్ వల్ల విశాఖ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయని చెప్పచ్చు.

ALSO READ | 2024లో శ్రీవారికి రూ. 1,365 కోట్ల ఆదాయం..

ఇదిలా ఉండగా.. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం నేపథ్యంలో ఏపీలోని పలు కీలక ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. రహదారి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం లభించగా... అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.