
- కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ, వెలుగు: ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (ఎస్ఏఎస్ సీఐ), డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిజం సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్’ కింద రాష్ట్రంలోని 2 ప్రాజెక్టులకు కేంద్రం రూ.141. 84 కోట్లను మంజూరు చేసింది. రామప్ప రీజియన్ సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ కి రూ. 79.74 కోట్లు, సోమశిల వెల్ నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల్ల ప్రాజెక్టుకు రూ.68.10 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ మేరకు గురువారం కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.