టెలికం పరికరాల తయారీ జోన్లను ఏర్పాటు చేస్తం : మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

టెలికం పరికరాల తయారీ జోన్లను ఏర్పాటు చేస్తం : మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
  • గత 10 ఏళ్లలో రూ. 1.28 లక్షల కోట్ల విలువైన ఫోన్ల ఎగుమతి 
  • కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

చెన్నై : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో టెలికం రంగం విప్లవాత్మకంగా మారుతుందని భావిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం దేశంలో టెలికమ్యూనికేషన్ పరికరాల తయారీ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం వెల్లడించారు.  గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం రూ. 1.28 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎగుమతి చేసిందని కేంద్ర కమ్యూనికేషన్లు,  ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి తెలిపారు.  

భారతదేశం ఒకప్పుడు మెజారిటీ మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకుందని, కేవలం రూ. 1,500 కోట్ల విలువైన మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విదేశాలకు రవాణా చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు మనదేశంలోనే 30 కోట్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచంలోనే మనం రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఉత్పత్తిదారుగా నిలిచామని అన్నారు. చెన్నైలో శుక్రవారం జరిగిన సిస్కో ప్లాంటు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘‘మనదేశంలో 98 బిలియన్ డాలర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐలు ఉండేవి.  గత 10 సంవత్సరాలలో ఇవి 60 శాతం వృద్ధి చెంది రూ. 160 బిలియన్ డాలర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐలకు చేరుకున్నాయి. 

టెలికం రంగంలో ఇదొక విప్లవం.  టెలికం పరికరాల తయారీ రంగంలో 39 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్​డీఐలు ఉన్నాయి. భారతదేశంలో 5జీ టెక్నాలజీ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. 98 శాతం నగరాల్లో 5జీ కవరేజీ ఉంది " అని ఆయన చెప్పారు.  ప్రభుత్వ అధీనంలోని టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  స్వదేశీ 4జీ టెక్నాలజీ ఆధారంగా 4జీ సేవలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని   వెల్లడించారు.  వచ్చే ఏడాది మధ్య నాటికి లక్ష టవర్లను నిర్మిస్తామని, దేశమంతటా 4జీని తీసుకొస్తామని సింధియా వివరించారు.  

సిస్కోతో భారీ ఉద్యోగాలు

సిస్కో ప్లాంటు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ కన్వర్జెన్స్ సిస్టమ్ రూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేస్తుందని, తమిళనాడుకు మరిన్ని పెద్ద ఉద్యోగాలను తీసుకువస్తుందని మంత్రి సింధియా చెప్పారు.  సిస్కోకు చెందిన పెరంబుదూర్ ఫెసిలిటీ ఉత్పత్తులను మెక్సికో, జపాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్,  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు కూడా ఎగుమతి చేస్తుందని ఆయన చెప్పారు.  "ఇలాంటి సౌకర్యాలతో, తమిళనాడు అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తన స్థానాన్ని సుస్థిరం చేస్తోంది.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలో, సిస్కో వంటి హైటెక్ కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మనం మరింత ముందుకు వెళ్తాం. ఇది సూక్ష్మ, చిన్న  మధ్యతరహా పరిశ్రమల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని  రాష్ట్రానికి మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది”అని ఆయన అన్నారు.  టెలికం నెట్​వర్క్​ ఎక్విప్​మెంట్​ కంపెనీ సిస్కో ప్లాంటు వల్ల 1,200 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.