పబ్లిక్​ ఫోన్ చార్జింగ్​ పిన్స్ వాడొద్దు..కేంద్రం వార్నింగ్

న్యూఢిల్లీ: ఎయిర్​పోర్ట్స్​, కేఫ్స్​, హోటల్స్​, బస్​స్టాండ్​లాంటి పబ్లిక్​ ప్లేసెస్​లో మీరు ఫోన్​ చార్జర్స్​ వాడుతున్నారా? అయితే, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు వార్నింగ్​ ఇస్తున్నది. యూఎస్​బీ చార్జింగ్​ స్కాంలు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్​ ఫోన్​ చార్జింగ్​ పిన్స్​ను వాడొద్దని హెచ్చరిస్తున్నది. సైబర్​ నేరగాళ్లు పబ్లిక్​ ప్లేసెస్​లో యూఎస్​బీ చార్జింగ్​ పోర్ట్స్​ను ఏర్పాటు చేసి, డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్టు తెలిపింది. ఇందుకోసం జ్యూస్​ జాకింగ్​ను ఉపయోగిస్తున్నట్టు చెప్పింది.

జ్యూస్​ జాకింగ్​ అంటే?

  •     సైబర్​ నేరగాళ్లు ప్రజల ఫోన్లనుంచి డేటాను చౌర్యం చేసేందుకు ఉపయోగిస్తున్న కొత్త పద్ధతి.
  •     ఇందుకు పబ్లిక్​ ప్లేసెస్​లో ఫేక్​ చార్జర్ల​ను అమరుస్తారు. వీటితో ఎవరైనా ఫోన్​ చార్జింగ్​ పెట్టుకోగానే అందులో మాల్​వేర్, ర్యాన్సమ్​వేర్​ను ఇన్​స్టాల్​ చేసి ఫోన్​లోని సమాచారం సేకరిస్తారు.  ఫోన్​ పనిచేయకుండా కూడా చేయగలరు.
  •     క్రెడిట్​ కార్డులు, పాస్​వర్డ్స్​లాంటి సున్నితమైన వివరాలు సైబర్​ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి.
  •     సేకరించిన సమాచారాన్ని తమకు కావాల్సిన విధంగా వారు వాడుకుంటారు. 
  • ఇలా చేస్తే సేఫ్​గా ఉండొచ్చు

  •     పబ్లిక్​ ప్లేసెస్​లో సొంత చార్జర్​ను ఎలక్ట్రిక్​ వాల్​ఔట్​లెట్స్​కు కనెక్ట్​ చేసుకోవాలి. సొంత​ కేబుల్స్​, పవర్​ బ్యాంక్స్​ వాడాలి
  •     డివైజ్​ను లాక్​ చేసుకోవాలి. తెలియని నెట్​వర్క్​లు లేదా కనెక్షన్​ను ఆపేయాలి.
  •     ఓపెన్​ వైఫై నెట్​వర్క్స్​ను వాడకూడదు. 
  •     అదనపు భద్రత కోసం యూఎస్​బీ డేటా బ్లాకర్​ను ఉపయోగించాలి. ఇది మీ పరికరం, చార్జింగ్​ స్టేషన్​ మధ్య డేటా మార్పిడిని నిరోధిస్తుంది.
  •     ఫోన్​ ఆఫ్​లో పెట్టి చార్జింగ్​ పెట్టాలి.
  •     ఒకవేళ సైబర్​ ఫ్రాడ్​ జరిగితే వెంటనే www.cybercrime.gov.in లేదా 1930 నంబర్​లో ఫిర్యాదు చేయాలి.