
సెన్సార్ లేదు.. రెస్పాన్సిబులిటీ లేదు.. కటింగ్స్ లేవు.. బీప్స్ అంతకన్నా ఏమీ లేవు.. ఏది పడితే అది.. ఎంత మాట అంటే అంత మాట.. పచ్చి బూతులు.. పచ్చి సీన్స్.. హీరో అయినా హీరోయిన్ అయినా.. అసలు ఎవరైనా సరే.. క్యారెక్టర్ ఏదైనా సరే.. అమ్మ నుంచి మొదలవుతుంది బూతు.. పచ్చి బూతులు.. పచ్చి సీన్స్.. ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్ లు చూడలంటే అమ్మ బాబోయే ఇదేమి హింస.. ఇవేమి డైలాగ్స్.. ఇంత పచ్చిగా ఉందేంటీ అనే మాటలు నోటి నుంచి వస్తాయి.
ఏమన్నా అంటే A సర్టిఫికెట్ ఇచ్చుకున్నాం.. ఓటీటీలకు సెన్సార్ ఏంటీ అనే వాదన తీసుకొస్తున్నారు.. ఇటీవల రణవీర్ అల్లాబాడియా వల్గర్ కామెడీ.. తల్లి దండ్రులు శృంగారం చేస్తుంటే చూశారా.. మధ్య డిస్ట్రబ్ చేశావా లాంటి డైలాగ్స్.. వల్గర్ కామెడీ తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్రం చాలా సీరియస్ అయ్యింది. రణవీర్ అల్లాబాడియా వల్గర్ కామెడీ తర్వాత.. అన్ని ఓటీటీలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.
Also Read :- నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో ఆ హీరోయిన్ సీన్స్ డిలీట్ చేశారా..?
ఈ క్రమంలో కంటెంట్ విషయంలో నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ముఖ్యంగా మహిళలని, పిల్లలని ఉద్దేశిస్తూ అసభ్యకర పదాలు ఉపయోగిస్తూ డైలాగులు చెప్పడం, అశ్లీల సన్నివేశాలు వీటిపై నిఘా ఉంచుతూ చిన్న పిల్లలు చూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరింది. మితిమీరిన అశ్లీలత, అసభ్యకర డైలాగులు ఉన్న వెబ్ సీరీస్ లేదా మూవీస్ కి సెన్సార్ సర్టిఫికెట్ జరీ చేసే సమయంలో తప్పనిసరిగా నిభందనలు పాటించాలని తెలిపింది. అలాగే కంటెంట్ ఎంపికల విషయంలో కూడా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు భాద్యతాయుతంగా వ్యవహరించాలని అలా కాకుండా వ్యూస్ కోసం ఏదిపడితే ఎంచుకుంటే మాత్రం చిక్కులు తప్పవని హెచ్చరించింది.