రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.  బహిరంగ సభలు.. రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి.  ఈ నేపథ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్‌ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్‌గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ALSO READ :- Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్ తగ్గేదేలే..జపాన్ ఫ్యాన్స్ సర్ ప్రైజింగ్ వెల్కమ్

లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి మధ్యలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇటీవల ఎన్నికల నిర్వహణ కోసం ఎంత మంది భద్రతా సిబ్బంది అవసరం అవుతారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందించింది.