![దక్షిణాదిపై కేంద్రం ఒంటెత్తు పోకడ](https://static.v6velugu.com/uploads/2025/02/centrel-government-ignored-south-states-say-pranalika-sangham-vice-chairman-chenna-reddy_CDo7W52cTh.jpg)
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఒంటెత్తు పోకడ ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఆరోపించారు. కేంద్రం మొదటినుంచీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని.. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలన్నారు. కేంద్రంపై కొట్లాటకు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాల్సిందేనన్నారు.
రాష్ట్రానికి నయా పైసా నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. తెలంగాణపై ప్రధాని ప్రతిసారీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు రూ.15,000 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7.5 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్నారు.