కేంద్రహోంమంత్రి అమిత్ షా తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు ఆయన వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈ రోజు ( మే 30) రాత్రి తిరుమల వకుళామాత గెస్ట్ హౌస్‌లో ఆయన బస చేయనున్నారు. శుక్రవారం ( మే 31) ఉదయం 8.30 నిమిషాలకు వెంకన్న స్వామి సేవలో పాల్గొంటారు. ఇక తిరుమలకు చేరుకున్న అమిత్ షాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం స్వామివారిని అమిత్ షా దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి అమిత్ షా నేరుగా రాజ్ కోట్ బయల్దేరి వెళ్లనున్నారు.
తిరుపతి, తిరుమలలో కేంద్రమంత్రి అమిత్ షా నివసించే అతిథిగృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. . కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా.. బీజేపీ,టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు.