కేంద్ర మంత్రి పదవి మీ భిక్షే: బండి సంజయ్​

కేంద్ర మంత్రి పదవి మీ భిక్షే: బండి సంజయ్​
  • నాతోపాటు లాఠీ దెబ్బలు తిన్నరు 

  • జైలుకెళ్లారు.. రక్తం చిందించారు

  • రేపటి సెల్యూట్ తెలంగాణకు రండి

  • కరీంనగర్ నేలకు సాష్టంగ ప్రణామం చేసిన కేంద్రమంత్రి బండి

కరీంనగర్: తనకు కేంద్ర మంత్రి పదవి రావడం కరీంగనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి ఆయన తన సొంతగడ్డ కరీంనగర్ కు వచ్చారు. ఈ  సందర్భంగా కరీంనగర్ నేలకు సాష్టంగ ప్రణామం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కృషితోనే తాను కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగానని చెప్పారు. 

కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడిన వారు తనతోపాటు కొంతమంది లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు.  ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో 155 రోజులు పాదయాత్ర చేసి 1600 కి.మీలు తిరిగితే.. నా అడుగులో అడుగు వేసి కార్యకర్తలు నడిచినందునే  ఈ పదవి వచ్చింది. అందుకే ఈ పదవి కార్యకర్తలకే అంకితం. కార్యకర్తలు నా పక్షాన ఉండకుంటే.. లాఠీదెబ్బలు తినకుంటే, జైలుకు వెళ్లకుంటే నాకు ఈ గుర్తింపు వచ్చేది కాదు.. కేంద్ర మంత్రి పదవి అధికారం కోసమో, పదవులు అనుభవించడానికో... అక్రమంగా సంపాదించుకోవడానికో కాదు.. దేశ రక్షణ, ధర్మ రక్షణ, సమాజ సంఘటితం కోసం... తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తా. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం ఈ పదవిని ఉపయోగిస్తా.’అని బండి సంజయ్ అన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు... ఎన్నికల తరువాత పూర్తిగా తెలంగాణ అభివృద్ధి, కరీంనగర్ అభివృద్ధి కోసమే పనిచేస్తానని అన్నారు.  రేపు కిషన్ రెడ్డి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుండి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళుతున్నా. సెల్యూట్ తెలంగాణ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా అని బండి సంజయ్ అన్నారు.