ఏపీని కేంద్రం ఆదుకుంటుంది: కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​

ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృదం పర్యటించింది. ప్రధాని మోదీ ఆదేశాలతో ఏపీకి అండగా ఉండటానికి వచ్చానని  కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ తెలిపారు.  ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన .. ఆకస్మిక వరదలతో విజయవాడ తల్లడిల్లిందన్నారు.  రెండు రోజుల్లో 40  సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని.. బుడమేరు గండిని పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందన్నారు.

ALSO READ | Pawan Kalyan: వరద బాధితులకు అండగా పవన్..తెలుగు రాష్ట్రాలకు రూ.6 కోట్ల భారీ విరాళం

  ఆంధ్రప్రదేశ్​ కేంద్రం అండగా ఉంటుందన్నారు.  లక్ష హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగిందని.. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఏపీ ప్రభుత్వం  తీవ్రంగా కృషి చేసిందన్నారు.  ఏపీ ప్రభుత్వం తీసుకున్న  సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ.. డ్రోన్​ ల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేశారని కేంద్రమంత్రి అన్నారు.  బుడమేరు వరదలకు అక్రమ మైనింగ్​ కారణమన్నారు, ఎన్డీఆర్​ఎఫ్​, ఎయిర్​ ఫోర్స్​ బృందాలను పంపామన్నారు.  క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసి సాయం అందజేస్తామన్నారు.  వ్యాపారులు, సామాన్యులు కూడా తీవ్రంగా నష్టపోయారని కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ అన్నారు.