సొంత వెహికల్ లేనివారికి ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు లేదా షేర్ ఆటోలు మాత్రమే ఆప్షన్ గా ఉండేవి కానీ ఇప్పుడు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ట్యాక్సీ యాప్స్ వచ్చేశాయి. సిటీలో చేతిలో ఫోన్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ యాప్స్ వాడుతున్నారనటంలో అతిశయోక్తి లేదు. అయితే.. యూజర్ల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్నాయి ట్యాక్సీ యాప్ లు. యూజర్లు వాడుతున్న ఫోన్ ని బట్టి వేరు వేరు చార్జీలు వసూలు చేస్తున్నాయి ఓలా, ఉబర్ వంటి యాప్స్. యూజర్ వాడే ఫోన్ ను బట్టి ఒకే లొకేషన్ కు యాండ్రాయిడ్ ఫోన్ అయితే ఒక రేటు.. ఐఫోన్ ఐతే మరో రేటు వసూలు చేస్తున్నాయి ట్యాక్సీ యాప్స్.
ఈ మేరకు గురువారం ( జనవరి 23, 2025 ) ఓలా, ఉబెర్‌లకు నోటీసులు జారీ చేసింది కేంద్రం.. రైడ్ బుక్ చేయడానికి ఉపయోగించే మొబైల్ ని బట్టి వేరు వేరు చార్జీలు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన కంప్లైంట్స్ పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది వినియోగదారుల మంత్రిత్వ శాఖ.
ALSO READ | చెన్నైలో ఆంధ్రా స్టూడెంట్ డ్రగ్స్ దందా.. మాఫియా డాన్ కావాలనే కోరికతో ఇలా..!
కంపెనీలు తమ ప్రైసింగ్ పద్దతిని వివరించాలని.. నోటీసులతో కోరింది కేంద్రం. మొబైల్ ఫోన్ మోడల్స్, బ్యాటరీ లెవెల్స్ ని బట్టి ఛార్జీలను పోల్చి చూస్తూ.. ఒకే లొకేషన్ కి వేరువేరు చార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.అతని పోస్ట్ వైరల్ కావడంతో, ఆరోపణలపై స్పందించింది ఉబర్ సంస్థ, ఫోన్, ఓఎస్ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించింది ఉబర్ .
పిక్-అప్ పాయింట్‌లు, ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్ అరైవల్ (ETA), డ్రాప్-ఆఫ్ పాయింట్‌లలో తేడా వల్ల ఛార్జీలలో వ్యత్యాసం ఉండచ్చని వివరణ ఇచ్చింది ఉబర్. ఈ అంశంపై స్పందించిన కేంద్రం వినియోగదారుల దోపిడీని ఏమాత్రం సహించబోమని, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.