ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రెండు టెస్టుల్లో ఫామ్ లేడనే విమర్శలు వచ్చినా.. రాజ్ కోట్ కోట్ లో జరుగుతున్న టెస్టులో సెంచరీ చేసి భారత్ ను ముందుండి నడిపిస్తున్నాడు. 157 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో హిట్ మ్యాన్ టెస్ట్ కెరీర్ లో తన 11 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీమిండియా సారధి సెంచరీకి తోడు జడేజా హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ (101), జడేజా (72) ఉన్నారు. టీ విరామానికి ముందు 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న హిట్ మ్యాన్.. టీ బ్రేక్ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3 వికెట్ల నష్టానికి 93 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా..సెకండ్ సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఎలాంటి చెత్త షాట్స్ ఆడకుండా ఒక్కో పరుగును జోడిస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో వీరిద్దరి భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. తొలి సెషన్ లో చక చక మూడు వికెట్లు తీసిన ఇంగ్లీష్ జట్టుకు సెకండ్ సెషన్ లో ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం విశేషం.
ఈ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మంచి ఆరంభం లభించలేదు. యువ ప్లేయర్లు యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి ఔటైతే.. శుభమన్ గిల్(0), రజత్ పటిదార్(5) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. దీంతో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను రోహిత్, జడేజా ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్ హార్టీలికి ఒక వికెట్ దక్కింది.
Rohit Sharma has 8 hundreds & 6 fifties from 50 innings in WTC history.
— Johns. (@CricCrazyJohns) February 15, 2024
- The dominance of Hitman. ?? pic.twitter.com/MCpqjmguR1