ప్రస్తుత ట్రెండ్​..పర్సనలైజ్డ్ మెడిసిన్ : సీఈఓ దీపక్ సప్రా

ప్రస్తుత ట్రెండ్​..పర్సనలైజ్డ్ మెడిసిన్ : సీఈఓ దీపక్ సప్రా

హైదరాబాద్, వెలుగు​:  రాబోయే 5 సంవత్సరాలలో  ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 20 కొత్త పర్సనలైజ్డ్ మందులు రాబోతున్నాయని, భారతదేశం కూడా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఈ విషయంలో వేగంగా పురోగమిస్తోందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ దీపక్ సప్రా అన్నారు. ఒక్కో డ్రగ్​ను మార్కెట్​కు తీసుకురావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. 

హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో డిజిటైజేషన్​పై శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  ఏఐ,  మెషిన్ లెర్నింగ్ వంటి వాటితో శరీరంలో మందులు ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయవచ్చని చెప్పారు. మన మొబైల్​ఫోనే త్వరలో రోగనిర్ధారణ పరికరంగా మారబోతుందని చెప్పారు.  విదేశాల్లోనే కాకుండా భారతదేశంలో పర్సనలైజ్డ్ మందులపై పరిశోధన జరుగుతుందని దీపక్ సప్రా తెలిపారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్, తయారీ రంగాలకు చెందిన 100కి పైగా ప్రముఖులు పాల్గొన్నారు