తెలంగాణ కాంగ్రెస్​కు సీఈవో నోటీసులు

తెలంగాణ  కాంగ్రెస్​కు సీఈవో నోటీసులు
  •     కేసీఆర్​పై చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరిన వికాస్​రాజ్

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్​ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ)వికాస్​రాజ్​వివరణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్​కు నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సీఈవో వికాస్​రాజ్ నోటీసులు ఇచ్చారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. రిప్లై ఇవ్వకుంటే సీఎం కామెంట్లను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు.