ఆమెరికాలోని కాలిఫోర్నియా-నెవడా సరిహద్దుల్లో 2024 ఫిబ్రవరి 11న హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన యాక్సెస్ బ్యాంకు సీఈవోతో పాటుగా మరో ఆరుగురు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని నిప్టన్ సమీపంలో రాత్రి 10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ALSO READ :- యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి
సీఈవో హెర్బర్ట్ విగ్వే తన భార్య, కుమారుడు మరికొందరితో కలిసి యూరోకాప్టర్ ఈసీ 130లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో.. అందులో ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్ గ్రూపు మాజీ ఛైర్మన్ అబింబోలా, ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్దషాక్ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. నైజీరియా యాక్సెస్ బ్యాంకు ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలందిస్తోంది.