
ఈవీఎం లపై వస్తున్న రూమర్లను ఖండించారు ఈసీఓ రజత్ కుమార్. మూడంచెల భధ్రత మధ్య ఈవీఎం లు ఉంటాయని చెప్పారు. సోషల్ మీడియాలో చెక్కర్లు కోడుతున్న వార్తలు అవాస్తవమని.. తప్పుడు వార్తలను స్ర్పెడ్ చేస్తున్న వారిపై పోలీసు కేసు పెట్టామని చెప్పారు. ఈవీఎంల మధ్య ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. ఎన్నికల కమీషన్ ను అనుమానిస్తే దేశంలో నమ్మకమనేది ఉండదని అన్నారు రజత్. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం ఐదు గంటలకు చెప్పిన పోలింగ్ శాతం కేవలం ఎస్టిమేటెడ్ ఫిగర్ అని చెప్పారు. కేంధ్ర ఎన్నికల సంఘానికి సాయంత్రం 5గంటలకు రిపోర్టు పంపాల్సి ఉంటుంది కావున ఎస్టిమేటెడ్ పోలింగ్ ను మాత్రమే చెప్పామని తెలిపారు. ఓవరాల్ పోలింగ్ శాతాన్ని మరుసటి రోజు చెప్పనున్నట్టు మీడియాకు అప్పుడే తెలిపామని అన్నారు.
జగిత్యాలలో ఈవీఎంలు బయటకు వచ్చిన వీడియో చక్కర్లు కొడుతుందని అన్నారు రజత్. అయితే ఆ ఈవీఎంలు.. ట్రైనింగ్ పర్పస్ లో భాగంగా తరలించినవేనని అన్నారు. ట్రైనింగ్ కోసం వాడిన ఈవీఎంలను పోలింగ్ లో వాడమని తెలిపారు. ఈవీఎంలు మొత్తం నాలుగు రకాలుగా ఉంటాయని చెప్పారు. అందులో మొదటి రకం మాత్రమే పోలింగ్ కు ఉపయోగిస్తామని అన్నారు. రెండవ క్యాటగిరీ ఈవీఎంలను తప్పని సరైతేనే వాడతామని చెప్పారు. వీటిని ఎవరు కూడా హ్యాక్ చేయలేరని చెప్పారు. ఇక మూడవ క్యాటగిరీ ఈవీఎంలను .. ట్రైనింగ్ పర్పస్ మరియూ రిసెర్చ్ కోసం వాడతామని తెలిపారు.. జగిత్యాలలో చక్కర్లు కొడుతున్న వీడియోలోని ఈవీఎంలు ఈ మూడవ క్యాటగిరీకి చెందినవని చెప్పారు. ఇక.. నాలుగవ క్యాటగిరీ ఈవీఎంలను కూడా సిబ్బందికి ట్రేనింగ్ ఇవ్వడానికి వాడతామని తెలిపారు. అయితే ట్రేనింగ్ కు వాడే ఈవీఎంలకు పెద్దగా సెక్యురిటీ ఉండదని అన్నారు.
పోలింగ్ అయ్యేటప్పుడు 17 A,17C తప్పక పాటిస్తామని చెప్పారు. 17A,17C అంటే ఓటు వేసిన తరువాత సంతకాన్నికూడా తీసుకుంటామని అన్నారు. అయితే మొత్తం పోలైన ఓట్లు సంతకాలతో ట్యాలీ చూసుకుంటామని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారి ఈ ఫార్మాలిటీని పూర్తిచేస్తారని… ఇందుకు సమయం పడుతుందని అన్నారు. చివరి పోలింగ్ బూత్ నుంచి ఈవీఎంలు రాత్రి 12.30 నిమిషాలకు చేరుకున్నాయని తెలిపారు. వీటన్నింటినీ స్ట్రాంగ్ రూంలలో భధ్రపరిచి పోలింగ్ శాతం మొత్తం లెక్కేసేసరికి తెల్లవారి 5 అయిందని అన్నారు. అప్పటి వరకు పోలింగ్ అధికారులు స్పాట్ లోనే ఉండి పర్యవేక్షించారని రజత్ తెలిపారు.
వేరే రాష్ట్రనికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గా ఉంటారని రజత్ కుమార్ తెలిపారు. వీరితో పాటు ఈవీఎంల దగ్గర అన్ని పొలిటికల్ పార్టీ పర్సన్స్ ఉంటారని చెప్పారు. వాళ్ల ముందే ఈవీఎంలను లాక్ చేసి స్ట్రాంగ్ రూం లకు పంపిస్తామని అన్నారు. ఈ స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భధ్రత ఉంటుందని తెలిపారు. మొదటి అంచెలో సెంట్రల్ పారా మిలటరీ భధ్రత మధ్య ఉంటాయని… రెండవ అంచెలో రాష్ట్ర పోలీసులు ఉంటారని అన్నారు. మూడవ అంచె దగ్గర వాహనాలు ఆపేసి నడుచుకుంటూ వెళ్లాల్సిఉంటుందని చెప్పారు.