జేఈఈ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో10లోపు 5 ర్యాంకులు శ్రీచైతన్యవే : సీఈవో సుష్మ బొప్పన

జేఈఈ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో10లోపు 5 ర్యాంకులు శ్రీచైతన్యవే : సీఈవో సుష్మ బొప్పన

హైదరాబాద్​, వెలుగు: ఐఐటీ -జేఈఈ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల సీఈవో సుష్మ బొప్పన అన్నారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకుతో పాటు 10లోపు ఐదు ర్యాంకులు తమ విద్యార్థులవేనని చెప్పారు. ఆదివారం హైదరాబాద్​లోని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓపెన్ కేటగిరీలో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. రాఘవ శర్మ జాతీయ స్థాయి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకు సాధించాడని వెల్లడించారు.

అలాగే, రిథమ్ కేడియా 4వ ర్యాంకు , పుట్టి కుశాల్ కుమార్ 5వ ర్యాంకు, రాజదీప్​ మిశ్రా 6వ ర్యాంకు, ధృవిన్ హేమంత్ దోషి 9వ ర్యాంకు, సిద్ధ్విక్​ సుహాస్ పదో ర్యాంకు సాధించారన్నారు. ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10లోపు 5 ర్యాంకులతో పాటు 100లోపు 30 ర్యాంకులు, 1,000లోపు 202 ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అలాగే, వివిధ కేటగిరీల్లో 100లోపు 146 ర్యాంకులు, 1,000లోపు 721 ర్యాంకులు సాధించారని చెప్పారు.

మొత్తం 3,728 మంది శ్రీచైతన్య విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించారని వెల్లడించారు. వాటితో పాటు 100లోపు 27 ర్యాంకులు, టాప్ వెయ్యి లోపు మరిన్ని ర్యాంకులు తమ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించారని వివరించారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విధానాల్లో విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందించామని తెలిపారు. ఈసందర్భంగా జాతీయ ర్యాంకులు పొందిన విద్యార్థులను మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆమె సత్కరించారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, ఇతర సిబ్బందిని సుష్మ అభినందించారు.