లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపామని చెప్పారు. ఫస్ట్ టైం హోం ఓటింగ్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించామని తెలిపారు.
ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 9లక్షల యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించామని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఫైనల్ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పాల్గొని ఓట్ పుస్తకం ఆవిష్కరించారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి గవర్నర్ ఓటర్ కార్డు పంపిణీ చేశారు.