హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 21 నుంచి మొదలవనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మల్టీజోన్ 1, 2 పరిధిలో మొత్తం 1288 పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు మొత్తం 10 రోజుల పాటు కొనసాగనుందని తెలిపారు. నాంపల్లిలోని ఎంఏఎం బాలికల మోడల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్ చేపడుతున్నట్లు తెలిపారు.