హైదరాబాద్ సిటీ, వెలుగు: డీఎస్సీ 2024 ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు 1:3 లిస్టులో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను మంగళవారం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి తెలిపారు. నాంపల్లిలోని ఎల్బీస్టేడియం ఎదురుగా ఉన్న మోడల్ ఆలియా ప్రభుత్వ హై స్కూల్లో ఉదయం 10 గంటల నుంచి వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 1:3 అభ్యర్థుల జాబితాను dcebhyderabad.webnode.in వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్(గెజిటెడ్ అటెస్టెడ్) కాపీలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు.