మెట్రో వాటర్ బోర్డు జూనియర్ అసిస్టెంట్లకు సర్టిఫికెట్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మెట్రో వాటర్ ​బోర్డుకు కొత్తగా కేటాయించిన 141 మంది జూనియర్ అసిస్టెంట్ల (పీఅండ్ఏ, ఎఫ్ అండ్ఏ) ట్రైనింగ్​ పూర్తయింది. గచ్చిబౌలి ఈస్కి క్యాంపస్​లో శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్ చీఫ్​గెస్ట్​గా హాజరై ఉద్యోగులకు సర్టిఫికెట్లు అందజేశారు.

141 మందిని 3 బ్యాచులుగా చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే 2 బ్యాచులకు శిక్షణ పూర్తైంది. మిగిలిన బ్యాచ్ కు సంక్రాంతి సెలవుల అనంతరం ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వీరిని వివిధ శాఖలకు కేటాయించనున్నారు.