ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు

ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు

ఆసిఫాబాద్, వెలుగు: ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గుర్తింపునిస్తూ వారికి ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను  కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అందజేశారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ అధికారి సావిత్రితో కలిసి ఐదుగురు ట్రాన్స్ జెండర్లకు ధృవపత్రాలు, గుర్తింపు కార్డులు అందిచారు. అంతకుముందు కలెక్టర్ తన ఛాంబర్​లో టాటా ట్రస్ట్ తెలంగాణ రీజనల్ మేనేజర్ భగీరథ గోప్, సుస్మిత (ఢిల్లీ), చితోరే (ముంబై)తో సమావేశమయ్యారు. 

జిల్లాలోని కౌటాల, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అధ్యయనం చేసి పరిష్కారం కొరకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాలో రైతులు ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.