ఇలా పరిష్కరించుకోవాలి: సెర్ట్-ఇన్ 

ఇలా పరిష్కరించుకోవాలి: సెర్ట్-ఇన్ 

క్రౌడ్ స్ట్రైక్ లాంచ్ చేసిన తాజా అప్డేట్ వల్లే ఈ సమస్య వచ్చిందని, దీనిని ‘క్రిటికల్’ సమస్యగా పేర్కొంటూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంకా సిస్టమ్ క్రాష్ అవడం లేదా ఆన్ లైన్​లో ఉండేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న వారు ఏం చేయాలనేదానిపై ఒక అడ్వైజరీని జారీ చేసింది.

విండోస్ సిస్టమ్​ను సేఫ్ మోడ్​లోకి బూట్ చేయాలి. లేదా విండోస్ రికవరీ ఎన్విరాన్ మెంట్​కు బూట్ చేయాలి.ఆ తర్వాత C:Windowsystem32driversCrowdStrike directoryకి వెళ్లాలి.అక్కడ "C-00000291*.sys" అనే ఫైల్​ను సెలక్ట్ చేసుకుని డిలీట్ చేయాలి.అనంతరం నార్మల్​గా హోస్ట్​ను బూట్ చేయాలి. 

సమస్యను పరిష్కరిస్తున్నాం..

క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇటీవల తెచ్చిన అప్డేట్​తో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సిస్టమ్స్ పై ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించేందుకు మేం క్రౌడ్ స్ట్రైక్​తో కలిసి యాక్టివ్​గా పని చేస్తున్నాం. సిస్టమ్స్ ను సురక్షితంగా రీస్టోర్ చేసుకునేందుకు వీలుగా చేపట్టాల్సిన రికవరీ ప్రాసెస్​పై కస్టమర్లను మా ఎక్స్ పర్ట్ లు గైడ్ చేస్తారు. 

- సత్య నాదెళ్ల, 
చైర్మన్ అండ్ సీఈవో, మైక్రోసాఫ్ట్