సెస్ ఎన్నికలు : పోలింగ్ సిబ్బంది నిరసన

సెస్ ఎన్నికల వేళ పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. టీఏ, డీఏ రెమినేషన్లలో కోతలు విధించారంటూ పీవోలు, ఏపీవోలు ఎన్నికల అధికారుల ముందు ఆందోళన చేపట్టారు. 2015లో  రూ.450  చెల్లించిన అధికారులు ప్రస్తుతం పెరిగిన పీఆర్సీ ప్రకారం ఒక్కొక్కరికి ప్రతిరోజు రూ.900 పైచిలుకు చెల్లించాల్సి ఉండగా.. రూ. 450 మాత్రమే చెల్లించారని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి భోజన సౌకర్యం కూడా సక్రమంగా లేదని వాపోయారు. అయితే  తమకు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారమే టీఏ,డీఏ, రెమిషన్ చెల్లించామని రాష్ట్ర కో ఆపరేటివ్ ఎన్నికల అథారిటీ ఆఫీసర్ సుమిత్ర తెలిపారు.  కొత్త జీవో ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే దాని ప్రకారం చెల్లిస్తామని తెలిపారు.