కరెంట్​ బకాయిలపై సెస్​ ఫోకస్..​ ప్రభుత్వ ఆఫీసుల బకాయిలే రూ.233కోట్లు

  • నోటీసులు ఇచ్చిన సెస్ ​పాలకవర్గం 
  • పెండింగ్​ బిల్లులున్న ఇండ్లకు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్​

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) లో విద్యుత్ బిల్లుల బకాయిలపై పాలకవర్గం ఫోకస్​పెట్టింది. రూ.280 కోట్లలో పేరుకుపోయిన బకాయిల వసూలుకు చర్యలు చేపట్టింది. ఇందులో ప్రభుత్వ ఆఫీసుల నుంచే సుమారు రూ.233 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలు రావాల్సి ఉంది.  డొమెస్టిక్, రైతుల నుంచి రూ.47 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వ ఆఫీసుల్లో బకాయిలు చెల్లించాలని గత నెలలోనే సెస్​ పాలకవర్గం నోటీసులు జారీ చేసింది. తాజాగా సెస్ సిబ్బంది గ్రామాల్లోని బిల్లులు పెండింగ్ ​ఉన్న డొమెస్టిక్ ​కస్టమర్లకు కరెంట్ ​కట్​చేస్తున్నారు. కాగా 
ప్రభుత్వ ఆఫీసులకు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. 

నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నరు

సెస్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసుల బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చి చేతులుదులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ.233కోట్లలో జీపీల పరిధిల్లో వాటర్ సప్లై,  స్ట్రీట్ లైట్స్ మెయింటనెన్స్ ​రూ.169.76 కోట్లు, సిరిసిల్ల మున్సిపాలిటీ రూ.1.37 కోట్లు, వేములవాడ మున్సిపాలిటీ రూ.1.44 కోట్లు, ఇతర ప్రభుత్వ ఆఫీసుల నుంచి రూ.3.77కోట్లు, సర్కార్ ​నుంచి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూమ్​బిల్లులు రూ.48.76 కోట్లు, ఎస్సీ, ఎస్టీ 101 యూనిట్ల కింద రూ.8.32 కోట్లు రావాల్సి ఉంది. 
వీటన్నింటికీ సెస్ ​అధికారులు నోటీసులు పంపారు. ప్రతి నెలా పంపుతున్నా బిల్లులు వసూలు కావడంలేదని సెస్ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. వీటికి కరెంట్​కట్ చేస్తే ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోతాయని సెస్​ అధికారులు భావిస్తున్నారు. కాగా నోటీసులు ఇచ్చినప్పుడల్లా నామమాత్రంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు సెస్​ అదికారులు చెబుతున్నారు. గృహ వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న సెస్​అధికారులు, ప్రభుత్వ ఆఫీసుల నుంచి వసూలు  చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మొత్తం బకాయిలు వసూలు చేస్తాం

సెస్ లో పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నాం. బిల్లులు చెల్లించాలని అన్ని ప్రభుత్వ ఆఫీసులకు నోటీసులు పంపాం. గృహ వినియోగదారులు బకాయిలు చెల్లించిన వెంటనే కరెంట్ కనెక్షన్ ఇస్తున్నాం. బకాయిలను రికవరీ చేసి సెస్ నష్టాన్ని పూడ్చుతాం.- సెస్ చైర్మన్ చిక్కాల రామారావు