శ్రీరామపునర్వసు దీక్షల విరమణ

శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
  •     వైభవంగా రామపాదుకల శోభాయాత్ర,గిరిప్రదక్షిణ

భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు    రామపునర్వసు దీక్షలు సోమవారం విరమించారు.  ఈ సందర్భంగా   ఆలయ ప్రాంగణంలోనే రామ పాదుకల శోభాయాత్ర నిర్వహించారు.  అనంతరం బేడా మండపంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేశారు. ఇరుముడులను ధరించి ప్రదక్షిణ చేశాక భద్రుని సన్నిధిలో అర్చకులు మాలను విరమింపజేశారు.