
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలారెడ్డి భర్త గోపాల్ రెడ్డికి చెందిన కొలను రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో సెంట్రల్ జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. ఫంక్షన్ హాల్కు సంబంధించి CGST కట్టడం లేదన్న సమాచారంతో సోదాలు చేస్తున్నారు.
నిజాంపేట మేయర్ నీలారెడ్డి కుటుంబానికి నిజాంపేటలో రెండు కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.