మంచిర్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి సీహెచ్. సుశ్రీత ప్రజ్వల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) స్టేట్‌మీట్‌లో సత్తా చాటింది. ఇటీవల హన్మకొండలో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో 80 మీటర్స్ హార్డిల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరుగనున్న ఎస్జీఎఫ్ఐ నేషనల్ మీట్‌కు ఎంపికైనట్టు కోచ్ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సుశ్రీతను ప్రిన్సిపాల్ సిస్టర్ రిన్సీ, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ టిస్సీ అభినందించారు.