టీటీడీ అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్య చౌదరి

టీటీడీ అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. వైకుంఠం క్యూ కంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆయన గరుడాళ్వార్ సన్నిధిలో అదనపు ఈవోగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకుల వేదాశీర్వచనాల మధ్య  బాధ్యతలు స్వీకరించారు వెంకయ్య చౌదరి. ఈ నేపథ్యంలో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ALSO READ | ఆధ్యాత్మికం: మౌనమే గొప్ప శక్తి ... యోగులు ఎలా మోక్షాన్ని సాధించారో తెలుసా.. 

ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన సంతృప్తికర దర్శనం కల్పించటమే తన  లక్ష్యమని అన్నారు.అధికారుల సమన్వయంతో సామాన్యభక్తులకు ప్రయోజనాలు పెంపొందించే చర్యలు చేపడతామని అన్నారు వెంకయ్య చౌదరి.