బీఆర్ఎస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు.. చంద్రబాబు,రేవంత్ రెడ్డి ఏజెంట్లను కూడా గెలిపించాం

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా నల్గొండలో బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నా..తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు.  తాము గౌరవం కోసమే మాట్లాడుతున్నామని..పదవుల కోసం కాదని చాడ కిషన్ రెడ్డి తెలిపారు. నల్గొండలో  తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో  చాడ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. 

బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించని  వాళ్ళపై కొట్లాడే హక్కు తమకు ఉందని చాడ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఏజెంట్లను, రేవంత్ రెడ్డి చెంచాలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తసే..వారికి గౌరవం ఇచ్చి గెలిపించిన మంచి మనసు ఉద్యమకారులది అన్నారు.  సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి అండగతో నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని..అయితే తెలంగాణ ఉద్యమకారులను అగౌరవ పరిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.